ఎన్‌కేఆర్‌ 21 లో సీనియర్‌ నటి ఫస్ట్‌ లుక్‌!

ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో నందమూరి  కళ్యాణ్ రామ్ యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘NKR21’.  ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది.  సోమవారం నటి విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ ను మూవీ మేకర్స్‌ విడుదల చేశారు.

 సినిమాలో విజయశాంతి ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్‌ చూస్తే తెలుస్తుంది. ‘వైజ‌యంతి ఐపీఎస్. తాను ప‌ట్టుకుంటే పోలీస్ తుపాకికి ధైర్యం వస్తుంది’ అంటూ గ్లింప్స్ లో చూపించిన డైలాగ్స్ హైలెట్ గా ఉండి. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. బింబిసారా, డెవిల్ లాంటి సూపర్ హిట్స్ అందుకున్న కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories