మరోసారి లవ్‌ మాస్టర్‌ గా శేఖర్‌ కమ్ముల!

ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తాజాగా తీసిన “కుబేర” చిత్రం మంచి విజయం సాధించింది. నాగార్జున, ధనుష్, రష్మిక ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కథ, నటన, సంగీతం అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఇది ₹100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ అభిమానులకూ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. న్యాచురల్ స్టార్ నాని‌తో కలిసి ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. నానీ కూడా ఈ ప్రాజెక్ట్‌కి ఆసక్తి చూపించినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే నానికి ఉన్న ప్రాజెక్టుల లైనప్ కారణంగా ఇది తక్షణమే ప్రారంభం కావడం కష్టం అని తెలుస్తోంది.

ఈ గ్యాప్‌లో శేఖర్ కమ్ముల మరో కొత్త కథపై పని మొదలు పెట్టాడట. ఇది ఓ ప్రేమకథగా ఉండే అవకాశం ఉంది. ఇందులో కొత్త నటీనటులను పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ వర్గాల్లో సమాచారం. అంతేకాక, నాని సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా పక్కా ప్లాన్‌తో కొనసాగించాలని చూస్తున్నాడట.

ఇక ఈ కథనాల్లో నిజమెంతనేది తెలుసుకోవాలంటే శేఖర్ కమ్ముల అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories