బాక్సాఫీస్‌ ను బద్ధలు కొట్టేందుకు శీలావతి రెడీ!

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ఘాటిపై సినీ ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించడం వల్ల ఆసక్తి మరింత పెరిగింది. మొదట విడుదల కావాల్సిన తేదీ నుంచి కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫైనల్‌గా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.

ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. రెండు గంటల 37 నిమిషాల నిడివితో థియేటర్లలో రాబోతుందని మేకర్స్ ఖరారు చేశారు.

ఈ సినిమాలో అనుష్క శీలవతి అనే పాత్రలో కనిపించనున్నారు. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. యాక్షన్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉండబోతాయని కూడా యూనిట్ తెలిపింది. విక్రమ్ ప్రభు ఒక కీలక పాత్రలో నటించగా, సాగర్ నాగవెల్లి సంగీతం అందించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories