భయపెట్టేలా ఘటికాచలం!

నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న తాజా సినిమా “ఘటికాచలం”. ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ రాజు నిర్మిస్తున్నారు . “ఘటికాచలం” చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు అమర్ కామెపల్లి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే “ఘటికాచలం” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

“ఘటికాచలం” సినిమాను వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేెఎన్, స్టార్ డైరెక్టర్ మారుతి. ఈరోజు “ఘటికాచలం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అమర్ కామెపల్లి మాట్లాడుతూ ఈ సినిమా కాన్సెప్ట్ ను యూఎస్ లో ఉండే నా స్నేహితుడు రాజు చెప్పాడు

వాళ్లకు తెలిసిన వారి ఇంట్లో జరిగే కొన్ని ఘటనలు చెప్పాడు. నాకు చాలా ఆసక్తిగాగా అనిపించింది. 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్ లో జరిగిన కథ ఈ సినిమా. రాజు మనమే ఈ మూవీ చేద్దామని అన్నారు. అలా ఘటికాచలం సినిమా మొదలైంది. మంచి టెక్నీషియన్స్ మనకు కావాల్సిన బడ్జెట్ లో ఎవరు దొరుకుతారని వెదికాను. మంచి టీమ్  నాకు దొరికారు. ఇలాంటి సినిమా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు. మారుతి గారికి ట్రైలర్ చూపించా, ఆయనకు నచ్చి మూవీ మొత్తం చూపించమన్నారు.

చూపించాను, మారుతి గారికి మూవీ నచ్చింది. చిన్న చిన్న మార్పులు చెప్పారు. ఎస్కేఎన్ చూశారు, ఆయనకూ నచ్చింది. కొన్ని క్రూషియల్ చేంజెస్ మారుతి గారు ఎస్కేఎన్ చెప్పారు. వారు చెప్పిన మార్పులు చేశాను. మూవీని టేకప్ చేసి విడుదల చేస్తున్నారు. మా మూవీ టీజర్, ట్రైలర్ నచ్చితేనే మూవీ చూడండి అంటున్నారు నిఖిల్ దేవాదుల. ఈ సినిమాలో నిఖిల్‌ దేవాదులతో పాటు ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి వంటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories