టాలీవుడ్ లో సమంత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలోనే వరుస ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన సినిమాల గురించి, తన జీవితం గురించి చెప్పుకొస్తుంది. తాజాగా సామ్ నటించిన హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ కి హానీ బన్నీ అనే పేరు కూడా పెట్టారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నటీనటులందరినీ ఒక వేదిక పైకి పిలిచి తమ ఓటిటిలో ప్రసారం కానున్న వెబ్ సిరీస్ లు సినిమాల గురించి ప్రకటించింది. ఈ ఈవెంట్ లో కూడా సమంత్ పాల్గొంది. అయితే ప్రస్తుతం సమంత సినిమాలేవి చేయడం లేదు. తాను ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ వాటి విజయాన్ని ఆమె ఆనందించలేదని చెప్పుకొచ్చింది.
దీంతో ఈ మాటలు విన్న వారంతా సమంత ఇక టాలీవుడ్ కి బై చెప్పిసిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక పూర్తిగా హిందీ పరిశ్రమ మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఓ తెలుగు దర్శకుడు, నిర్మాతలు ఆమెతో సినిమా చేయడానికి అడిగినప్పుడు కూడా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తుంది.
ఇక సామ్ ఫోకస్ మొత్తం హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ ల మీదే పెట్టినట్లు తెలుస్తుంది. అందుకే సమంత ఎక్కువగా ముంబైలో కనిపిస్తోంది అనే కూడా ఓ ప్రచారం జోరుగా సాగుతుంది. అంతేకాకుండా సమంత హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లి పోయే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.