రావు బహుదూర్‌ గా సత్యదేవ్‌!

ట్యాలెంటెడ్ యాక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సత్యదేవ్. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘జీబ్రా’ మంచి బజ్‌తో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా సత్యదేవ్ కెరీర్‌లోనే బిగ్ బడ్జెట్ చిత్రం. ఇక ఇప్పుడు ఆ సినిమాను మించిన బడ్జెట్‌తో తన నెక్స్ట్ చిత్రాన్ని సైలెంట్‌గా పూర్తి చేస్తున్నాడు.

దర్శకడు వెంకటేష్ మహా డైరెక్షన్‌లో సత్యదేవ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘రావు బహదూర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమా వస్తుందనే వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వెంకటేష్ మహా ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే, ఈసారి పక్కా కమర్షియల్ మూవీతో ఈ డైరెక్టర్ రానున్నట్లు తెలుస్తుంది.

మరి ఈ మూవీలో సత్యదేవ్ పాత్ర ఎలా ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికరంగా వెల్లడించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Related Posts

Comments

spot_img

Recent Stories