జగన్ మొసలి కన్నీరుపై  పేలుతున్న సెటైర్లు!

విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్మెంట్ ఇప్పటిదాకా చెల్లించడం లేదంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతా ద్వారా కారుస్తున్న మొసలి కన్నీరుపై సెటైర్లు పేలుతున్నాయి. మూడు క్వార్టర్స్ కు సంబంధించి ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయనేలేదని, దీని వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కాలేజీలు మానేసి కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని, జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా పలు విధాలుగా ఆవేదన వెలిబుచ్చారు. అయితే ఈ ఆవేదన మొత్తం కూడా మొసలి కన్నీరు మాత్రమేనని.. విద్యార్థుల ఫీజు రిఇంబర్స్మెంట్ గురించి ప్రశ్నించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని విమర్శలు వెల్లువలా వస్తున్నాయి ఆయన తీరు మీద సెటైర్లు పేలుతున్నాయి.

సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రశ్నించడం అంటే నవ్వు వస్తున్నదని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ పరిపాలన కాలంలో విద్యార్థులు ఫీజులు చెల్లించలేదనే కారణంతో పరీక్షలు రాయకుండా ఆగిపోవాల్సి వచ్చిందని.. పరీక్షలు రాసి పాసైన వారికి కూడా కాలేజీలు ధ్రువపత్రాలు ఇవ్వకపోవడంతో వారు పైచదువులకు వెళ్లలేక ఒక ఏడాది వృధా అయ్యే పరిస్థితి దాపురించిందని గుర్తుచేస్తున్నారు.అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం అయినందుకు ఆవేదన వ్యక్తం చేయడం కామెడీగా ఉన్నదని అంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ రూపేణా మూడు వేల కోట్ల బకాయి పెట్టి వెళ్లారని, ఆ మొత్తాలు అన్నీ కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విడతలు విడతలుగా చెల్లిస్తున్నదని బాల వీరాంజనేయ స్వామి చెబుతున్నారు.

అదా నీ దగ్గర నుంచి స్వీకరించిన ముడుపుల వ్యవహారం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో- జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టిని పక్కకు మళ్ళించడానికి ఇలాంటి డ్రామా ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు రాష్ట్రమంతా కూడా 1750 కోట్ల రూపాయల లంచం తీసుకుని రాష్ట్ర ప్రజల మీద దాదాపు లక్ష కోట్ల భారం వేసినందుకు.. జగన్మోహన్ రెడ్డి స్వార్థ బుద్ధి గురించి చర్చించుకుంటూ ఉండగా, ఆయన ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించ లేదంటూ కాకుల లెక్కలతో ఎక్స్ ఖాతాలో పోస్టులు పెడుతున్నారు. సాక్షిలో వచ్చిన కథనాలను ట్యాగ్ చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రయత్నించడం సాహసమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ తన తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని అందరూ అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories