నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’పై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ‘హిట్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో మూడో భాగంగా రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని ఎలాంటి రక్తపాతం చేయబోతున్నాడా అనేది విడుదల చేశారు.
ఇక ఈ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్ర ఎలాంటి జాలి, దయ లేని ఓ పోలీస్ ఆఫీసర్‌గా మనకు చూపెట్టబోతున్నారు. అయితే, ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కేమియో ఉండబోతుందని.. ఆ పాత్ర ‘హిట్-4’ మూవీ కొనసాగింపుకి లీడ్‌గా ఉండబోతుందని నాని ఇప్పటికే తెలిపాడు. అయితే, తాజాగా ఈ పాత్రలో తమిళ హీరో కార్తి నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం ‘సర్దార్-2’ మూవీలో బిజీగా ఉన్న కార్తి, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యాడు. దీంతో అతడు అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి నిజంగానే అర్జున్ సర్కార్ కోసం సర్దార్ నిజంగానే వస్తాడా లేదా అనేది వేచి చూడాలి.