మళ్లీ సంక్రాంతి టార్గెట్‌నే!

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విక్టరీ వెంకటేష్ అని గ్యారంటీగా చెప్పుకోవచ్చు. అయితే మళ్ళీ చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చిన వెంకీ మామ దెబ్బకి రీజనల్ గా ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో పడింది. అయితే ఇపుడు వెంకీ మామ నెక్స్ట్ ఎవరితో అనేది ఆసక్తిగా మారగా ఈ చిత్రం ఎవర్ గ్రీన్ కాంబో త్రివిక్రమ్ తో దాదాపు ఖాయం అని ఇపుడు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం విషయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది.

ఈ ఏడాదిలోనే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో సంక్రాంతి బరిలో విజయం అందుకున్న తరువాత  మళ్ళీ వచ్చే  సంక్రాంతికే వెంకీ మామ త్రివిక్రమ్ ల సినిమా రానున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ త్రివిక్రమ్ మాటల్లో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని ఏ రేంజ్ లో అలరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇపుడు డైరెక్ట్ సినిమా కాబట్టి అంతకు మించే అంచనాలు ఉన్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories