విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “కింగ్డమ్” ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్లు ఊపందుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఒక ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. విజయ్ దేవరకొండతో కలిసి “అర్జున్ రెడ్డి” లాంటి సెన్సేషనల్ సినిమా చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఈసారి “కింగ్డమ్” ప్రమోషన్ లో భాగంగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. గతంలో వీరి కలయిక ఎంతగా వర్కౌట్ అయ్యిందో తెలిసిన విషయమే కాబట్టి, ఇప్పుడు మరోసారి వీరిద్దరూ స్క్రీన్ మీద కనిపించబోతున్నారన్న వార్త సినిమాపై మరింత హైప్ తెస్తోంది.
ఇంకా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రావాల్సి ఉంది కానీ, అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సినిమా కోసం అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మాణం చేపట్టారు. జూలై 31న ఈ చిత్రం భారీగా థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్, మ్యూజిక్ అప్‌డేట్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిన నేపథ్యంలో, ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ సినిమా ప్రమోషన్ లో ఒక మేజర్ మైల్ స్టోన్ గా నిలవనుంది.