సందట్లో సడేమియా: వాళ్లను గమనించుకోవాలట!

ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు గట్టిగానే కొట్టుకుంటున్నాయి. నాయకుల మీద రాళ్లు విసరడం అనే టాపిక్ మీద ప్రస్తుతానికి ఇరు పార్టీల మధ్య ఆరోపణల యుద్ధం నడుస్తోంది. అసలు విషయం తేలకపోయినప్పటికీ.. పరసప్పరం నిందించుకుంటే రాయి రాజకీయం చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే.. ప్రజల దృష్టిలో పార్టీలు చులకన అయిపోతున్నాయి కూడా. ఇలా మత్తగజాలు కొట్లాడుకుంటూ ఉంటే.. మధ్యలో చిన్న జంతువులు లాభపడినట్టుగా.. వీరి పోరాటం మధ్యలో లాభపడాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఏపీలో రాళ్ల పంచాయతీ నడుస్తోందని, ఇలాంటి చిల్లర విషయాల మీద కొట్టుకునే పార్టీలు ఉంటే ఏమొస్తుందని.. ఇలాంటి నాయకుల్ని నమ్ముకునే బదులుగా.. ఏపీ ప్రజలు ఒకసారి కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అంటున్నారు.

అంటే ఏమిటన్న మాట.. ఏపీలోని తెలుగుదేశం, వైసీపీ పార్టీలు ఇలాంటి రాళ్ల పంచాయతీమీద టైం వేస్టు చేస్తూ చిల్లర రాజకీయం చేస్తున్నాయి కాబట్టి, అలాంటి వాళ్లను కాకుండా.. కాంగ్రెసు పార్టీని ఎన్నుకుంటే కేవలం ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తుందని ఆయన హామీ ఇస్తున్నారన్నమాట.

ఏపీలో కాంగ్రెసు పార్టీ పదేళ్ల కిందటే శవాసనం వేసిన సంగతి అందరికీ తెలుసు. ఏదో ఇప్పుడ కాస్త దూకుడుగా మాట్లాడగల షర్మిలను పార్టీ సారథిగా చేసినందువలన.. పార్టీ యొక్క ఓట్ షేర్ కొంతవరకైనా పెంచుకోగలమని కాంగ్రెస్ కాన్సంట్రేట్ చేస్తోంది. ఇప్పటికి కూడా ఒక్కసీటైనా గెలుస్తామనే నమ్మకం వారికి కూడా లేదు. షర్మిల కడప లోక్ సభ స్థానంలో ‘అవినాష్ హంతకుడు- జగన్ రక్షకుడు’ అనే నినాదంతో దూసుకుపోతున్నారు గానీ.. ఆ నినాదం ఆమెను ఎంపీగా గెలిపిస్తుందో లేదో డౌటే. రేవంత్ రెడ్డి కూడా ఏపీలో ప్రచారానికి వెళ్తారని అంటున్నారు. అయినా సరే.. ఓటు షేర్ పెంచుకోడానికే తప్ప గెలవడానికి కాదు అనేది అందరూ అంటున్నమాట. ఇలాటి సమయంలో , ఆ రెండు పార్టీలు కాదని కాంగ్రెస్ ను ప్రజలు గమనించుకోండి అని జగ్గారెడ్డి అనడం కామెడీగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories