ప్రముఖ నటి సమంత కొంత కాలం క్రితం పాడ్ కాస్ట్ ప్రారంభించి ప్రజలలో ఆరోగ్యం పట్ల అవెర్ నెస్ పెంచేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాడ్ కాస్ట్ లో కొద్ది రోజుల క్రితం ఓ వెల్ నెస్ కోచ్ తో పలు సూచనలు చెప్పించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
కాలేయ ఆరోగ్యానికి డాండెలిన్ అనే పూల మొక్క చాలా బాగా ఉపయోగపడుతుందని సదరు వెల్నెస్ కోచ్ గారు చెప్పారు. ఈ వీడియోను చూసిన ఓ కాలేయ వ్యాధి నిపుణుడు సోషల్ మీడియాలో స్పందించారు. తాను గత పది సంవత్సరాలుగా కాలేయ వ్యాధి వైదునిగా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
సమంత మొదలు పెట్టిన పాడ్కాస్ట్ జనాలను తప్పుదోవ పట్టిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డాండెలిన్ కాలేయానికి మేలు చేస్తుందనేదానికి ఆధారాలు లేవని వివరించారు. కనీస అవగాహన లేకుండా నోటికొచ్చింది చెప్పి ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడాలనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు.
డాండెలిన్ గురించి ఏదీ కూడా శాస్త్రీయంగా రుజువు కాలేదని తెలిపాడు సదరు వైద్యుడు. ఇకనైనా సమంత ఇలాంటి పనులు మానుకుంటే బెటర్ అంటూ హితవు పలికాడు.