విజయ్ దేవరకొండ “ఖుషి”లో కనిపించినప్పటి నుండి సమంత వెండితెరకు దూరంగా ఉంది. అయితే ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు అందుబాటులోనే ఉంది. తాజాగా ఆమె అట్లీతో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ సమంత ఈ ప్రాజెక్ట్ను కైవసం చేసుకుంటే, అది ఆమె కెరీర్లో కీలక మలుపు తిరగవచ్చు. ఆరోగ్య కారణాల వల్ల ఆమె కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చింది. తాజాగా సమంతా ఒక పెద్ద సినిమా అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ అవకాశం అందిపుచ్చుకుంటే మాత్రం ఆమె దశ తిరిగిందనే చెప్పవచ్చు.
దీనికి సంబంధించిన వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.