పుష్ప 2 లో అతిథి పాత్రలో సమంత!

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌ లో వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంది. అల్లు అర్జున్‌ ని జాతీయ నటుడిగా నిలబెట్టింది. పాన్‌ ఇండియా లెవల్లో విజయం సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలో గర్వంగా నిలిచిన సినిమా ఇది. ఇప్పుడు దానికి సీక్వెల్‌ రాబోతుంది. ఈ సినిమా కోసం అటు బన్నీ అభిమానులతో పాటు భారత్‌ లోని చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చాలా వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా టాలీవుడ్‌ స్టార్‌ నటి అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇంతకు ఆ నటి మరెవరో కాదు.. సమంత. సామ్‌ పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌ లో నటించి కుర్రకారు మనసులు దోచింది. తాజాగా పుష్ప 2 లో కూడా సమంత ఉంటుందనే వార్త వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో వేచి చూడాలి.

ఈ సినిమాను ఆగస్టు 15 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

Related Posts

Comments

spot_img

Recent Stories