హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన పలు సంఘటనల తర్వాత ఆమెలో మార్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇందులో భాగంగా ఆరోగ్యం, ఆత్మస్థైర్యం, మహిళల సంరక్షణ వంటి విషయాలపై గత కొంతకాలంగా సామ్ నెటిజన్లకు సందేశాలు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో బంధాలకు సంబంధించి ఆన్లైన్లో వచ్చే పోస్టులను సామ్ లైక్ లేదా షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా వైవాహిక బంధాలు విచ్ఛిన్నం కావడంపై వచ్చిన ఒక సోషల్‌మీడియా పోస్ట్‌ను సమంత లైక్ చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ, ఆ పోస్ట్ లోని మేటర్ ఏంటంటే… అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవడానికే భర్త లు ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలిపే సారాంశం.
కాగా ఆ పోస్ట్ లో మ్యాటర్ ఏమి ఉందంటే.. ‘జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యానికి గురైతే, ఆ భర్త భార్యను వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే, మహిళలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. భర్త ఆరోగ్యం బాగోకపోయినా అతడిని విడిచిపెట్టాలనుకోవడం లేదు. తాజా సర్వే ప్రకారం ఇది నిరూపితమైంది. భార్యతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్లే భర్త ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని సర్వేలో తేలింది’’ అనేది ఆ పోస్ట్. ఇప్పుడు ఈ పోస్ట్ ను సమంత లైక్ కొట్టడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.