ఆ డైరెక్టర్‌ తో మూడోసారి జతకట్టబోతున్న సామ్‌!

ఆ డైరెక్టర్‌ తో మూడోసారి జతకట్టబోతున్న సామ్‌! స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ బిజీగా ఉంది సమంత. అయితే, ఇప్పుడు టాలీవుడ్‌లో మరోసారి సమంత ఓ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

గతంలో జబర్దస్త్, ఓ బేబీ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె సమంతకు ఓ కథను వినిపించగా, దానికి సామ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి సమంత కోసం నందిని రెడ్డి ఎలాంటి కథను తీసుకొస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక తమ అభిమాన హీరోయిన్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటించనుందని తెలిసి సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories