బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక సల్మాన్ ఖాన్ ఏం చేసినా అభిమానులు కూడా తెగ ఫాలో అవుతుంటారు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవి ఏంటంటే… ‘నేను సాధారణంగా రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్ర పోతాను. నెలకోసారి మాత్రం 8 గంటలు పడుకుంటాను.
కొన్నిసార్లు సినిమా చిత్రీకరణ సమయంలో సన్నివేశాల మధ్య విరామం వచ్చినప్పుడు కాసేపు కునుకు తీస్తాను’ అంటూ సల్మాన్ చెప్పుకొచ్చాడు. సల్మాన్ మాటలకు అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అంత తక్కువ సమయం నిద్ర పోతే అనారోగ్య సమస్యలు రావా ? అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు
సల్మాన్ తన నిద్ర గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘అయితే, నేను షూటింగ్‌లు లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కావాల్సినంత నిద్ర పోతాను. అందుకే జైల్లో ఉన్నప్పుడు హాయిగా 8 గంటలు నిద్రపోయాను. ఇక నేను ప్రయాణం చేసే విమానంలో సాంకేతిక సమస్య వచ్చి ఆలస్యం అయితే, ఆ సమయంలో కూడా నేను ఎక్కువగా నిద్రపోతాను. ఎందుకంటే అప్పుడు నేనేం చేయలేను కదా’ అంటూ సల్మాన్ చెప్పుకొచ్చారు.