సలార్‌ 2 లో పాల్గొనేది అప్పుడేనా!

రెబల్ స్టార్ ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ..ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తు ఉంది. సినిమా విడుదల అయిన 6 రోజుల్లోనే  రూ.700 కోట్ల మార్క్ కు చేరువ‌లో చేరడంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన తీరుకి ప్రేక్ష‌కులు ఎంతో సంతోషిస్తున్నారు.

ఈ సినిమా త‌రువాత ప్ర‌భాస్ ఇప్పుడు త‌న తరువాత చిత్రం పై ఫోక‌స్ పెట్టేందుకు రెడీ అయ్యాడు. కన్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో క‌లిసి ‘స‌లార్ – ది సీజ్ ఫైర్’ అనే సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అయిన ‘స‌లార్ – శౌర్యంగ ప‌ర్వం’ చిత్రాన్ని రూపొందించేందుకు ప్ర‌భాస్ రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమా షూటింగ్ లో ప్ర‌భాస్ ఆగ‌స్టు 10 నుంచి జాయిన్ కానున్నడని సమాచారం. ఈ సినిమాతో పాటు ‘రాజా సాబ్’ చిత్ర షూటింగ్ లోనూ ప్ర‌భాస్ పాల్గొంటాడనే వార్తలు వస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories