ప్రకటనల్లో బొక్కిన తీరుపై సాక్షి కల్లబొల్లి కబుర్లు!

వడ్డించేవాడు తమవాడైతే వరస చివరలో ఉన్నా ఏమీ పరవాలేదని సామెత. తాము ఎవరి కోసమైతే కరపత్రం లాగా పనిచేస్తూ ఉన్నామో వారే అధికారంలో ఉన్నప్పుడు ఇక ప్రకటనలకు కొదవేముంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో సాక్షి పత్రిక అడ్డగోలుగా ప్రకటనల రూపంలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టింది.

తమాషా యేమిటంటే ఒక్క సాక్షి దినపత్రికకు 371 కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తే, అగ్రస్థాయి దినపత్రిక ఈనాడుకు మాత్రం కేవలం 243 కోట్ల విలువైన ప్రకటనలు మాత్రమే ఇచ్చారు. ఇలాంటి దుర్మార్గపు దోపిడీని ఇటీవల మీడియా బయట పెట్టింది. ఈ వ్యవహారంపై సాక్షి తమను తాము సమర్ధించుకునే ప్రయత్నంలో మరింతగా తమ నేరాన్ని బయట పెట్టుకుంటున్నది.

సాక్షికి ఈనాడుకు సమానంగా ప్రకటనలు ఇచ్చారని బుకాయిస్తున్న సాక్షి దినపత్రిక అందుకు చెబుతున్న వాదన చాలా చిత్రంగా ఉంది. సాక్షి పత్రికకు ఐదేళ్లలో 371 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారని, అదే ఈనాడు విషయానికి వచ్చేసరికి మూడున్నరేళ్లలోనే 243 కోట్ల ప్రకటనలు ఇచ్చారని.. అంటే ఇంచుమించు సమానమే అవుతుందని వారు అభివర్ణిస్తున్నారు. ఒకటిన్నర ఏడాది పాటు ఈనాడుకు ప్రభుత్వం అసలు ప్రకటనలే ఇవ్వలేదని తద్వారా వారు ఒప్పుకుంటున్నారు.

అయితే ఈనాడు దినపత్రిక ప్రభుత్వ ప్రకటనలు తాము ప్రచురించబోం అంటూ ప్రత్యేకంగా లేఖ రాసిందని, అందువల్ల మాత్రమే ఆ ఒకటిన్నర సంవత్సరం పాటు ఈనాడుకు ప్రకటనలు ఇవ్వలేదని వైయస్సార్ కాంగ్రెస్ సాక్షి పత్రిక డొంకతిరుగుడు కథలు చెబుతోంది.
ప్రభుత్వ ప్రకటనలు తాము ప్రచురించం, మాకు ప్రకటనలు వద్దు అని ఒక అగ్రస్థాయి దినపత్రిక లేఖ రాసింది- అని అనడం చిత్రాలలోకెల్లా పెద్ద విచిత్రం.

ఒకవేళ ఈనాడు నిజంగా అలాంటి లేఖ రాసి ఉంటే ఆనాడే సాక్షి ఆ విషయాన్ని వార్తగా ప్రచురించి ఉండాలి. లేదా, ప్రభుత్వం వార్తగా పత్రికా ప్రకటన విడుదల చేసి ఉండాలి. అంతటి సీరియస్ సంగతి అది ఒకటిన్నర సంవత్సరాల పాటు వారికి ఒక్క రూపాయి ప్రకటనలు ఇవ్వకుండా తమకు ప్రభుత్వం డబ్బులు వద్దన్నారు అన్నట్లుగా ఒక అబద్ధపు లేఖ గురించి ప్రస్తావించడం చోద్యంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి ప్రచురించిన వార్త ద్వారానే అసలు ఇన్నాళ్లపాటు ప్రకటన రూపంలో సాక్షి మీడియా ఎంత ఘోరంగా దోచుకున్నదని సంగతి అందరికీ అర్థమవుతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories