సాయికుమార్‌ తమ్ముడి ఓన్‌ సినిమా సుబ్రహ్మణ్య!

సౌత్ సినిమా దగ్గర ఎన్నో వేల సినిమాలకి తన పవర్ఫుల్ వాయిస్ తో అనేక రకాల మాడ్యులేషన్స్ తో ఆడియెన్స్ కి కనిపించకుండా ఎంతో ఇంపాక్ట్ కలిగించిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది రవి శంకర్ అనే చెప్పుకొవచ్చు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ సోదరుడిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటుడిగా కూడా తెలుగు సహా కన్నడ సినిమాల్లో తాను బాగా పరిచయం. అయితే ఇప్పుడు రవి శంకర్ డైరెక్షన్‌ లో  అనౌన్స్ చేసిన భారీ చిత్రమే “సుబ్రహ్మణ్య”.

రవి శంకర్ తనయుడు, కొత్త నటుడు అద్వయ్ హీరోగా పరిచయం అవుతూ అనౌన్స్ చేసిన భారీ పాన్ ఇండియా సినిమాగా ఇది రాబోతుంది. మరి ఇంట్రస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ని తాజాగా విడుదల చేయగా ఈ సినిమాకి సలార్, కేజీయఫ్ సంగీత దర్శకుడు రవి బసృర్ సంగీతం అందించనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ చిత్రంని తిరుమల రెడ్డి, అనీల్ కడియాల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. అలాగే ఈ మూవీ తెలుగు, కన్నడ సహా తమిళ్, హిందీ, మళయాళ భాషల్లో అది కూడా ఐమ్యాక్స్ వెర్షన్ లో ఈ చిత్రాన్ని విడుదల  చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ చిత్రంపై మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories