ట్యాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘శబ్దం’ ఫిబ్రవరి 28న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు అరివళగన్ వెంకటాచలం డైరెక్ట్ చేయగా తమిళ, తెలుగు భాషల్లో ఈ మూవీని గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాను తెలుగులో నిన్న(ఫిబ్రవరి 28) గ్రాండ్ రిలీజ్ చేసినా, తమిళ్‌లో మాత్రం బొమ్మ థియేటర్లలోకి రాలేదు.
దీంతో తమిళ అభిమానులు ఈ సినిమా యూనిట్‌పై మండిపడ్డారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ తమిళ్ రిలీజ్ ఆలస్యం అయ్యిందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా ఈ చిత్రాన్ని తమిళ్ భాషలోనూ గ్రాండ్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు తమిళ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
పూర్తి హార్రర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం మేజర్ అసెట్‌గా మారనుంది. మరి ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.