టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులపై కన్నేశాడు ఈ క్రేజీ హీరో. ఇక తన నెక్స్ట్ చిత్రానికి సంబంధించి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవల ఓ క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చారు.
దిల్ రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ బ్యానర్‌లో త్వరలో ‘రౌడీ జనార్థన్’ అనే సినిమా తెరకెక్కుతుందని.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ రుక్మిణీ వాసంత్‌ను తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నించారట. అయితే, ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పిందట. దీంతో ఈ సినిమాలో ఆమె నటించబోదనే వార్త కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.