వెంకీ కుడుముల డైరెక్షన్ లో హీరో నితిన్ – శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. మార్చి 28, 2025 న ఈ సినిమా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే, కొన్ని స్టెప్పుల విషయంలో ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక గీతంలో కేతికా శర్మ సందడి చేసింది. ఈ పాటను కొన్ని మార్పులతో థియేటర్లలో ప్రదర్శించిన టీమ్.. అదే వెర్షన్‌ను ఇప్పుడు విడుదల చేసింది.
ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో ఆదిపురుష్ నటుడు దేవదత్త నాగే విలన్ రోల్ లో నటించగా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఇక వీరితో పాటుగా డేవిడ్ వార్నర్ కూడా సాలిడ్ క్యామియోలో కనిపించారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మోవీబీఎ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది.