ఇండస్ట్రీలో సంచలనాలకు, కాంట్రవర్సీలకు పెట్టింది పేరు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన మాట్లాడిన సెన్సేషనే.. సినిమాలు చేసినా సెన్సేషనే. నాకు నచ్చిందే చేసే మనస్తత్వం ఆర్జీవీది. ముందు నుంచి కూడా ఆయన అనుకున్నదే చేస్తారు తప్ప ఎవరు ఏం చెప్పినా వినడు. ఒకప్పుడు కమర్షియల్, క్రైమ్ , హర్రర్ సినిమాలు చేసి రికార్డులు తిరగరాసిన చరిత్ర ఆర్జీవీది.
ప్రస్తుతం ఆర్జీవీ అన్ని కూడా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు, రాజకీయ పరమైన సినిమాలు చేస్తూ ఉన్నారు. తాజాగా ఆయన శారీ అనే సినిమాను చిత్రీకరిస్తున్నట్లు వివరించారు. అది పూర్తిగా అడల్ట్ కంటెంట్ సినిమాలాగానే ఉందని చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ ని బట్టి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
తాజాగా ఆర్జీవీ మరో సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఆ సినిమా పేరే నా పెళ్లాం దయ్యం. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఆర్జీవి తన ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు. ఆ పోస్టర్ లో ఓ మహిళ వంటగదిలో పని చేసుకుంటుండగా.. కింద ఓ తాళి ఫొటో ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ గురించి పక్కన పెడితే .. ఈ టైటిల్ గురించి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
అందరి పెళ్లాలు దయ్యాలే ఓ నెటిజన్ అంటే.. ఈ కాలంలో ఇలాంటి సినిమాలు ఎంతో అవసరమని మరోకరు అన్నారు. ఈ కామెంట్లు చూసి నెటిజన్లు కూడా చాలా నవ్వుకుంటున్నారు.