సోషల్ మీడియాను వాడుకుని అసభ్యమైన పోస్టులు పెట్టినందుకు, ఒక ప్లాట్‌ఫాం ఉన్నది కదా అనే దూకుడుతో అత్యంత హేయగా ప్రవర్తించినందుకు ఇప్పుడు అనేకమందిమీద కేసులు నమోదు అవుతున్న సంగతి అందరికీ తెలుసు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనే ముసుగులో చత్త పోస్టులు పెట్టిన వారంతా ఇప్పుడు అరెస్టులకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద కూడా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అయితే కిరాయి డబ్బుల కోసం తన సినిమా ప్రమోషన్స్ చేయడానికి ఎంతకైనా దిగజారే ఆర్జీవీ.. ఇప్పుడు కేసు నుంచి తప్పించుకోవడానికి కావాలంటే జగన్మోహన్ రెడ్డిని తిుతూ గానీ, లోకేష్ బ్రాహ్మణి లను పొగుడుతూ గానీ.. ఇంకో పోస్టు సునాయాసంగా పెట్టేయగలరు కదా.. అని ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఎన్నికలకు ముందు.. సినిమా మీడియం ద్వారా.. చంద్రబాబునాయుడు మీద బురద చల్లడానికి, ఆయనను విలన్ గా ప్రొజెక్టు చేస్తూ ప్రజల్లో చులకన చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘమైన స్కెచ్ వేశారు. రాంగోపాల్ వర్మతో రెండు మూడు చిత్రాలు చేయించి.. ప్రజల మీదికి వదలాలని అనుకున్నారు. వం కోట్ల రూపాయలు సాలిడ్ గా ఆయనకు ఇచ్చినట్టుగా, సినిమాల బాధ్యత అంతా ఆయన చూసుకునేట్టుగా డీల్ కుదిరింది.
సాధారణంగా రాంగోపాల్ వర్మ.. తనకు నిర్మాత రూపంలో డబ్బు పెట్టే వారు దొరికితే చాలు.. వారికి ఏం కావాలంటే అది – తన భావజాలంతో సంబంధం లేకుండా సినిమా తీసి ఇచ్చేస్తాడని.. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం స్పైసీగా ఏం కావాలంటే అది చేస్తారని పేరుంది. అలాంటిది ఆయన- వైఎస్సార్ మరణం నుంచి జగన్ సీఎం కావడం వరకు పరిణామాలను వ్యూహం సినిమాగా తెరకెక్కించారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఏదో ఒక చెత్త వ్యాఖ్యలు చేసే ఉంటారు. ఆ క్రమంలో నారా లోకేష్ బ్రాహ్మణి లను కించపరిచే మాటలు చెప్పి ఉంటారు. అవి ఇప్పుడు తలకు చుట్టుకుంటాయని ఆయన ఊహించి ఉండకపోవచ్చు.
కానీ ఆర్జీవీ వ్యాఖ్యలు కేవలం కిరాయి వ్యాఖ్యలు, కూలి మాటలు అని గుర్తించాలి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డిని అత్యంత నీచంగా తిడుతూ పోస్టులు పెట్టగరు కూడా అని పలువురు అంటున్నారు. మొత్తానికి ఈ కేసు ను ఆర్జీవీ ఎలా డీల్ చేస్తారో.. వైసీపీ లీగల సెల్ సాయం తీసుకుంటారో లేదో వేచిచూడాలి.