ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘వార్ 2’ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తుందని మేకర్స్ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి భారీ స్థాయిలో తెరకెక్కించారు. కానీ విడుదలైన తర్వాత సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ప్రతికూల టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం డిజాస్టర్‌గా మారే పరిస్థితి కనిపిస్తోంది.

యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఫలితం విఫలమవడంతో వారికి నిరాశ ఎదురైంది. అయితే ఈ అనుభవం నుండి పాఠాలు నేర్చుకుంటూ, ఇకముందు అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.

ఇప్పటికే వారు తర్వాతి ప్రాజెక్ట్ ‘ఆల్ఫా’పై దృష్టి పెట్టారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం పూర్తయింది. శార్వరి కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో చిన్న చిన్న లోపాలూ ఉండకూడదనే ఉద్దేశంతో టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories