రిలీజ్‌ డేట్‌ నో చేంజ్‌.. కారణం అదేనా!

జాతీయ నటుడు అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక కథానాయికగా స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం పుష్ప 2 ..ది రూల్‌. ఈ సినిమా గురించి ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్‌ విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర  భాషల ఆడియన్స్ కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. నిజానికి పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే.

అయితే మూవీ ఇప్పటికే ఆల్మోస్ట్ 70 శాతం వరకు పూర్తి కాగా మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని చిత్ర బృందం వెల్లడించింది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ కూడా మూవీలో తక్కువ శాతమే ఉంటాయని, త్వరలో ఈ కార్యక్రమాలన్నింటిని ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించేందుకు టీమ్ సిద్దంగా ఉందని సమాచారం

ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ లేదంటుంది చిత్ర బృందం.  ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుండి టీజర్ విడుదల కానుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories