బాలయ్య ఇంట్రో కోసం కసరత్తులు!

నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో తన కెరీర్‌లో మరోసారి ఊపును అందుకున్నాడు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లాంటి సినిమాలతో మంచి విజయాలు సాధించిన ఆయన ఇప్పుడు బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ 2లో నటిస్తున్నాడు. అదే సమయంలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో కూడా కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే షూటింగ్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. మొదటి కీలక షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో మొదలవుతుంది. ఈ భాగంలో బాలయ్య ఇంట్రడక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర కోసం తమిళ హీరోను తీసుకోవాలని టీమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని కూడా ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ బాలయ్యతో మళ్లీ కలిసి పనిచేయడం తనకు గర్వకారణమని తెలిపారు. ఈసారి మరింత శక్తివంతమైన సినిమా రాబోతుందని, ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండే ప్రాజెక్ట్ అవుతుందని చెప్పుకున్నారు. ఇది బాలకృష్ణ కెరీర్‌లో 111వ సినిమా.

Related Posts

Comments

spot_img

Recent Stories