రికార్డ్‌ ఓపెనింగ్స్‌ !

లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది విక్కీ కౌశల్ అలాగే రష్మిక మందన్నా కలయికలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా శివాజీ మహారాజ్ తనయుడు పోరాట యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించబడిందని తెలిసిందే.

మరి మొదటి నుంచి కూడా సాలిడ్ హైప్ ఉన్న ఈ సినిమా ఈ వైలెంటైన్స్ డే నాడు వరల్డ్ వైడ్ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఒక్క ఇండియా వైడ్ గా 33 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకి పైగా గ్రాస్ అందుకున్నట్టుగా మేకర్స్ తెలిపారు. దీనితో బాలీవుడ్ నుంచి మరో 50 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ఇది నిలిచింది అని చెప్పాలి. మరి ఈ వీకెండ్ లో వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories