విధ్వంసానికి సిద్దమా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా ‘పుష్ప-2’ గురించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ ప్రెస్టీజియస్ మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ నెక్స్ట్ లెవెల్‌లో తీర్చిదిద్దుతున్నాడని.. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలవడం ఖాయమని అభిమానులు ఎంతో గట్టిగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా నుండి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్‌ను నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు విడుదల  చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ ట్రైలర్‌తో ఊచకోత ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఈ ట్రైలర్ అన్ని రికార్డులను వేటాడటం చూస్తారని వారు అంటున్నారు.

 ఇదే విషయాన్ని వారు ఇప్పుడు సరికొత్త పోస్టర్‌తో వెల్లడించారు. పుష్పరాజ్ రెండు గొడ్డలను పట్టుకుని విధ్వంసాన్ని సృష్టిస్తు్న్నట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను పాట్నా నగరంలో గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప-2’ మూవీ భారీస్థాయిలో విడుదలకు సిద్దమవతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories