న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హిట్-3’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్’ చిత్రాల ఫ్రాంచైజీలో మూడో పార్ట్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇక అర్జున్ సర్కార్ అనే రుత్‌లెస్ కాప్‌గా నాని విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నుంచి టీజర్‌ను నాని పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
ఈ టీజర్‌తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. దానికి తగ్గట్టుగానే ఈ టీజర్‌పై అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 24న రిలీజ్ చేయనున్న ఈ టీజర్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ టీజర్‌పై మరింత ఆసక్తిని పెంచేలా ‘రెడీ బాయ్స్’ అంటూ నాని ఓ లాఠీ పట్టుకుని చెప్పే డైలాగ్ వీడియోను వదిలారు.
‘రక్తపాతం సృష్టించేందుకు అర్జున్ సర్కార్ సిద్ధం..’ అంటూ హిట్-3 మేకర్స్ ఈ టీజర్‌పై అంచనాలను పెంచుతున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మే 1న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.