రీ ప్లేస్‌మెంట్! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇపుడు చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ లలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా తీర్చిదిద్దుతున్న సాలిడ్ యాక్షన్ మూవీ కూడా ఒకటి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా మేకర్స్ గ్రాండ్ లెవెల్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
అయితే ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొన్ని రూమర్స్ రెహమాన్ దేవిశ్రీ ప్రసాద్ ని ఈ మూవీకి రీప్లేస్ చేసాడు అంటూ మొదలయ్యాయి. అయితే దీనిపై కొన్ని అంతర్గత వర్గాల ద్వారా అసలు నిజం తెలుస్తుంది. రెహమాన్ ని దేవిశ్రీ ప్రసాద్ రీప్లేస్ చేస్తున్నాడు అనే మాటలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.
ఈ చిత్రానికి పూర్తిగా రెహమాన్ మాత్రమే అందించనున్నారట. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పుకోవచ్చు. మరి రెహమాన్ ఆల్రెడీ రెహమాన్ రెండు మూడు సాంగ్స్ కూడా ఈ చిత్రానికి ఇచ్చేశారని టాక్ ఉంది.