వేడుకగా మొదలైన ఆర్సీ 16 సినిమా పనులు !

గ్లోబర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ఆర్ఆర్‌ఆర్ సినిమా తరువాత శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ చేంజర్‌ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ క్రమంలోనే చరణ్‌ సాన బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ ముద్దు గుమ్మ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌ లో ఎంతో గ్రాండ్‌ గా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ , సుకుమార్‌ రైటింగ్స్ నిర్మాణంలో సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమన్‌ సంగీతాన్ని అందించనున్నారు.

కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్‌ ని ఖరారు చేశారని వార్తలు వచ్చాయి కానీ మూవీ నేమ్‌ ఇంకా ఫిక్స్‌ అవ్వలేదని చిత్ర బృందం తెల్చి చెప్పింది.ఈ పూజా కార్యక్రమానికి ఉపాసన, డైరెక్టర్‌ శంకర్‌, సుకుమార్‌ తో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా హజరైయ్యారు.

Related Posts

Comments

spot_img

Recent Stories