టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మాస్ జాతర”. రవితేజ నుంచి ఒక ప్రాపర్ మాస్ మసాలా ఎంటర్టైనర్ పడి చాలా కాలం అయ్యింది. మరి దానికి సమాధానంగా దర్శకుడు భాను బోగవరపు ప్లాన్ చేసిన సినిమానే ఈ “మాస్ జాతర”.
సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమోని విడుదల చేశారు. మరి ఈ ప్రోమో మాత్రం ఫ్యాన్స్ ని మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకెళ్ళిపోయింది అని చెప్పవచ్చు. కొన్నాళ్ల కితమే ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ ఇడియట్ సినిమా సాంగ్ చూపుల్తో గుచ్చి గుచ్చి రీమిక్స్ ఉంటుంది అని టాక్ వచ్చింది.
మరి దీనిని నిజం చేస్తూ మేకర్స్ ఇచ్చిన ప్రోమో అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. భీమ్స్ మరోసారి తనకి లైఫ్ ఇచ్చిన రవితేజ కోసం మరో సెన్సేషనల్ చార్ట్ బస్టర్ ని మిక్స్ చేసాడని చెప్పొచ్చు. ఇక ఈ ఫుల్ సాంగ్ ని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి సితార ఎంటెర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.