మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ‘తూ మేరా లవర్’ అంటూ సాగే ఈ మాస్ బీట్ సాంగ్‌ను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌తో ఈ విషయాన్ని వారు రివీల్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో రవితేజ తనదైన స్వాగ్‌తో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.