పుష్ప 2 నుంచి రష్మిక ఫొటో లీక్‌..ఎంత బాగుందో చూశారా!

స్టైలిష్‌ స్టార్‌, జాతీయ నటుడు అల్లు అర్జున్ , సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఎన్నో నేషనల్‌ అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాకి సీక్వెల్‌ గా పుష్ప 2 రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఎంతో వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ను విశాఖలో జరుపుకుంటుంది.

పెద్ద హీరోల సినిమాలు అంటే ఏదోక మూల నుంచి సినిమాకు సంబంధించిన లీకులు వస్తునే ఉంటాయి. అలాగే పుష్ప 2 కి సంబంధించి కూడా చాలా లీకులు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెట్స్‌  నుంచి రష్మిక ఫొటో లీక్‌ అవ్వడం తో ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 లో శ్రీవల్లి ఎరుపు రంగు చీరలో ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ఎంత అందంగా ఉందో… ఈ ఫోటోను రష్మిక ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తుంటే.. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

పుష్ప 2 సినిమా పనులు ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యాయి. డబ్బింగ్‌ పనులను కూడా మొదలు పెట్టేశారు. ఈ సినిమా ను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా పనులు చివరికి చేరుకోవడంతో అటు బన్నీ  కానీ, ఇటు రష్మిక కానీ తమ తరువాత సినిమాలను లైన్లో పెడుతున్నారు.

ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో బిజీగా ఉంది..

Related Posts

Comments

spot_img

Recent Stories