బాలీవుడ్‌ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ లో చేయనున్న రానా!

టాలీవుడ్ యంగ్‌ హీరో  రానా ఫుల్ లెంగ్త్ రోల్ లో క‌నిపించి చాలా రోజులు అవుతోంది. ఆయ‌న తాజాగా న‌వ‌దీప్ న‌టించిన ‘ల‌వ్ మౌళి’ సినిమాలో అఘోర పాత్ర‌లో న‌టించారు. ఈ పాత్ర‌లో రానా ప్రేక్ష‌కుల‌ను స‌ర్ ప్రైజ్ చేశారు. కాగా, ఆయ‌న ప్ర‌స్తుతం ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కు సీక్వెల్ పార్ట్ లో న‌టిస్తున్నారు. ఇందులో  మ‌రో సీనియర్‌  స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కూడా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉంది.

అయితే, రానా త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ మూవీలో న‌టించేందుకు సిద్దమవుతున్నాడంట. బాలీవుడ్ డైరెక్ట‌ర్ అమిత్ రాయ్ త్వ‌ర‌లో తెర‌కెక్కించే పీరియాడిక్ సినిమాలో రానా కూడా ఓ ముఖ్య పాత్రలో  న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో షాహిద్ క‌పూర్ శివాజీ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, రానా ఔరంగ‌జేబ్ పాత్ర‌లో న‌టిస్తాడ‌ట‌. ఈ సినిమాలో ఆయ‌న‌ది ఫుల్ లెంగ్త్ రోల్ అని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories