రానా వర్సెస్‌ రజినీ!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ మరికొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమాలో రజినీకాంత్ ఓ పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నారు. దర్శకుడు జ్ఞాన్‌వేల్ ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించాడు.

ఇక విడుదలకి  దగ్గరపడటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసి సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మరో ప్రోమోను విడుదల చేయగా, ఇందులో రజినీకాంత్ వర్సెస్‌ రానా దగ్గుబాటి సీన్స్ మనకు చూపెట్టారు. వారి మధ్య డైలాగ్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.

ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తో పాటు మరికొంత మంది నటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సాలిడ్ సంగీతాన్ని అందించాడు. .

Related Posts

Comments

spot_img

Recent Stories