తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త తరానికి బాగా కనెక్ట్ అవుతున్న హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. తన యాక్షన్ ఎనర్జీ, స్టైల్ తో పాటు ఎంచుకునే కథల వల్ల రామ్ కి ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. ఆయన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా హిందీ ప్రేక్షకుల్లో కూడా బాగా చేరువ అవుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా రామ్ కి అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది.
ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో రామ్ చేసిన ఒక పోస్ట్ రికార్డు స్థాయిలో లైక్స్ అందుకుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ పోస్ట్ ఏ సినిమా ప్రమోషన్ గురించో కాదు, కేవలం తన ఫోటోని షేర్ చేసిన సాధారణ అప్డేట్ మాత్రమే. కానీ ఆ ఫోటోకు 7.6 మిలియన్లకుపైగా లైక్స్ రావడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ లెక్కలు చూసినప్పుడు రామ్ క్రేజ్ ఎంత పెద్ద స్థాయిలో ఉందో అర్థమవుతోంది. తెలుగు స్టార్ హీరోల్లో ఇలాంటి రికార్డు సాధించిన తొలి వ్యక్తిగా రామ్ నిలిచాడు.
ప్రస్తుతం ఆయన “ఆంధ్ర కింగ్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.