మన భారతీయ సంస్కృతిలో రామాయణం ఒక చిరస్మరణీయమైన ఇతిహాసం. ఏ తరంలో చూసినా, ఎన్ని సార్లు సినిమాగా తీసినా ఈ కథకు ఉండే క్రేజ్ మాత్రం ఎప్పటికీ తక్కువయ్యేలా లేదు. ఇటీవలి కాలంలో ‘ఆదిపురుష్’ రూపంలో రామాయణం ఆధారంగా ఒక భారీ చిత్రం వచ్చినా, ఇప్పుడు మళ్లీ అదే నేపథ్యంతో తెరకెక్కుతున్న మరో భారీ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. ఈసారి బిగ్ స్క్రీన్‌పై మనం చూడబోయే రామాయణం రూపం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండబోతోందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమాను నితీష్ తివారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ మాత్రం అంచనాల్ని ఆకాశానికెత్తేలా చేశాయి. విజువల్స్ చూస్తే ఇది కేవలం ఒక సినిమా కాదనిపిస్తుంది. మేకర్స్ ఈ గ్లింప్స్ ద్వారా చూపించిన దృశ్యాలు చూస్తే, ప్రేక్షకుడిని పూర్తిగా ఓ కొత్త అనుభూతిలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఇది సింపుల్‌గా స్క్రీన్‌పై చూడదగిన గ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు.
ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ఈ పాత్రల్లో రణబీర్, యష్ లపై చూపించిన సన్నివేశాలు చూస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం. వాటిలో ఉన్న డిటైల్, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే, వారి పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయో అర్థమవుతుంది.
ఇంకా సంగీత పరంగా కూడా ఈ చిత్రం చాలా స్పెషల్. ఒకవైపు హాలీవుడ్ కంపోజర్ హాన్స్ జిమ్మర్, మరోవైపు మన ఏ ఆర్ రెహ్మాన్ కలిసి ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ కలయిక సినిమాకు అంతర్జాతీయ స్థాయి వైబ్ తీసుకువచ్చింది.
గ్లింప్స్ చివర్లో రణబీర్‌ను రాముడిగా, యష్‌ను రావణుడిగా చూపించిన కొన్ని శాట్స్ మాత్రమే చూసినా, ఇది సాధారణ సినిమా కాదని స్పష్టమవుతుంది. భారతీయ సినిమాలో ఓ మైలురాయిగా నిలిచే విధంగా ఇది తెరకెక్కుతోంది అనిపిస్తుంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. సినిమా మొదటి భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మొత్తంగా చెప్పాలంటే, ఈ గ్లింప్స్ రామాయణం సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసి, బిగ్ స్క్రీన్‌పై మళ్లీ ఓ విశిష్టమైన అనుభవాన్ని ఇచ్చేలా హైప్ క్రియేట్ చేసింది.