మెస్మరైజ్‌ చేస్తున్న రమణ గోగుల గోదారి గట్టు!

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్‌ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో వెంకీ-అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ సక్సెస్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండనుందని ఇప్పటికే మేకర్స్ అంటున్నారు.

ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘గోదారి గట్టు’ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ పాట మెలోడీగా సాగడం.. రమణ గోగుల చాలా రోజుల తరువాత ఈ పాటను పాడటంతో ప్రేక్షకులు ఈ పాటకు మెస్మరైజ్‌అవుతున్నారు. మంచి క్యాచీ ట్యూన్‌తో భీమ్స్ సిసిరోలియో ఈ పాటను కంపోజ్ చేయగా.. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్‌ల జోడీ చక్కటి స్టెప్స్‌ తో  ఆకట్టుకున్నారు.

 ఇక ఈ పాటకు యూట్యూబ్‌లో ఏకంగా 4 మిలియన్ వ్యూస్ రావడంతో ప్రస్తుతం ట్రెండింగ్‌ మారింది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి యాక్ట్‌ చేస్తుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్, దిల్ రాజు ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories