యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్‌లోని 22వ సినిమాని రూపొందిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ అదిరిపోయే వార్తను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
కొత్త సంవత్సరం కానుకగా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘‘ప్రేమతో.. ఈ కొత్త సంవత్సరం’’ అంటూ వారు ఓ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరోయిన్ చున్నీతో హీరో తన తల తుడుచుకుంటున్నట్లు కనపడుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా చేస్తోంది.
జనవరి 1న ఉదయం 10.35 గంటలకు ఈ ట్రీట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మూవీటీమ్ ప్రకటించింది.