ముహుర్త కార్యక్రమాలతో లాంఛ్ అయిన రామ్‌ మూవీ!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తన తరువాత సినిమాకి రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. తన కెరీర్ లో  22వ చిత్రాన్ని రామ్‌ యువ దర్శకుడు మహేష్ బాబుతో చేయబోతున్నాడు. మరి మేకర్స్ రీసెంట్ గానే ప్రకటించగా నేడు ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలతో మొదలయ్యింది.

 హైదరాబాద్ లోనే చిత్ర యూనిట్ సహా టాలీవుడ్ ప్రముఖ దర్శకుల హాజరుతో ఈ కార్యక్రమాన్ని మేకర్స్ ఎంతో ఘనంగా నిర్వహించారు. మరి ఇందులో రామ్ కొత్త లుక్స్ అదిరాయని చెప్పొచ్చు. రామ్‌ మాస్ నుంచి మళ్ళీ చాలా రోజులకి క్లాస్ లుక్ లోకి తాను మారాడు.

 అలాగే యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా  ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో తెరకెక్కనున్న ఈ మూవీని టాలీవుడ్ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మా బాధ్యతలు చేపట్టారు.

ఇక అతి త్వరలోనే షూటింగ్ మొదలు కానుండగా మరిన్ని డీటెయిల్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories