నేను చేసిన అతి పెద్ద తప్పు ఇదే!

హీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’ తాజాగా గాయపడింది. అయితే, తనకు జరిగిన ప్రమాదం గురించి పూర్తిస్థాయిలో రకుల్ తాజాగా మాట్లాడింది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ రకుల్ ఏం చెప్పింది అంటే..  ‘అది అక్టోబర్ 5, ఆ రోజు నేను మరిచిపోలేని రోజు. ఎప్పట్లానే జిమ్ కు వెళ్లాను. 80 కిలోలు లిఫ్టింగ్ చేశాను.

దాంతో సడెన్ గా నా వెన్నెముకలో నొప్పి వచ్చింది. కానీ, ఆ నొప్పిని నేను పెద్దగా పట్టించుకోలేదు. అదే నేను చేసిన పెద్ద తప్పు’ అని రకుల్ వివరించింది. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ.. ‘నాకు ఆ నొప్పి ఉన్నా.. నేను నేరుగా షూటింగ్ కు వెళ్లాను. రాత్రి ఇంటికొచ్చేసరికి వంగలేకపోయాను.

ఓ దశలో నా దుస్తులు కూడా నేను మార్చుకోలేకపోయాను. ఆ తర్వాత నాలుగు రోజులకు సడన్ గా నా నడుము నుంచి కింది భాగం మొత్తం చలనం లేకుండా అయిపోయింది. ఒక్కసారిగా నా బీపీ కూడా పడిపోయింది. అంతే ఆ దెబ్బతో స్పృహ తప్పిపోయాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది’ అంటూ వివరించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories