రాఖీ భాయ్‌ తల్లి ప్రొడ్యూస్‌ చేస్తున్న సినిమా!

కన్నడ హీరో యష్ ‘కేజీయఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. రాకింగ్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు ఈ హీరో. ఇక ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రంతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ఈ హీరో రెడీ అవుతున్నాడు. అయితే, ఇప్పుడు ఈ హీరో తల్లి శ్రీమతి పుష్ప అరుణ్ కుమార్ కూడా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు.

పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా ‘కొత్తలవాడి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యంగ్ ట్యాలెంట్‌కు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె ‘పా ప్రొడక్షన్స్’ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక ఈ బ్యానర్ నుంచి ‘కొత్తలవాడి’ చిత్రాన్ని ఆమె ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తుండగా శ్రీరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

పక్కా మాస్ అంశాలతో ఈ టీజర్ కనిపించడంతో ఈ మూవీపై సినీ వర్గాల్లో మంచి అంచనాలు మొదలైయ్యాయి. కర్ణాటకలోని ఓ ఊరి పేరు ‘కొత్తలవాడి’ కాగా, ఆ ఊరులో షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories