రాజ్‌నాధ్ ఫోన్ ఓ కామెడీ.. జగన్ జవాబు మరీ కామెడీ!!

దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార ఎన్డీయే కూటమి రాధాకృష్ణన్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. వారికి స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆయన ఆ పదవికి ఎన్నిక కావడం కేవలం లాంఛనమే. అయితే.. లాంఛనప్రాయమైన ఈ ఎన్నిక కోసం కూడా.. చేయవలసిన కసరత్తును మాత్రం మరచిపోకుండా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. పైగా ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని కూడా అనుకుంటున్నది. అందులో భాగంగానే.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఫోను చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయం కోసం సహకరించాలని కోరారు.

ఇదంతా సహజంగా జరిగేదే కదా.. ఇందులో కామెడీ ఏం ఉంది చెప్మా అని అనుకోవచ్చు. కానీ.. విషయం ఏంటంటే.. రాజ్‌నాధ్ సింగ్, ప్రతిపక్ష నేత మల్లిఖార్చున ఖర్గే కు కూడా ఫోన్ చేసి.. ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని కోరారు. అయితే ఆయననుంచి సానుకూల స్పందన రాలేదు. యూపీఏ కూటమి అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనేతోనే ఉంది. నేడో రేపో అభ్యర్థి ప్రకటన ఉంటుందని అనుకుంటున్నారు. కాంగ్రెస్ సారథి తిరస్కరించిన తర్వాత.. ఇక ఏకగ్రీవం అనేది లేనట్టే. మరి.. జగన్ కు ఫోను చేసి అడగాల్సినంత అవసరం రాజ్ నాధ్ సింగ్ కు ఉన్నదా అనేది ప్రశ్న. జగన్ పార్టీకి రాజ్యసభలో 7 గురు, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. 11 మంది సభ్యుల బలంతో ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికలను ప్రభావితం చేసేంత, గెలిపించేంత, లేదా ఓడించేంత సీన్ లేనేలేదు. ఇప్పుడు ఎన్డీయే జగన్ బద్ధశత్రువు తెలుగుదేశం కీలక భాగస్వామి కాబట్టి.. ఆయన కినుక వహించినా సరే.. యూపీఏ అభ్యర్థికి మద్దతిచ్చేంత సీన్ జగన్ కు లేదు. రాజ్ నాధ్ అయినా మద్దతుకోసం ఫోన్ చేశారు గానీ.. రాహుల్ ను విమర్శించిన నేపథ్యంలో కాంగ్రెస్ దళాలు అసలు జగన్ కు ఫోను కూడా చేయవు. ఒకవేళ చేసినా సరే.. భాజపాను ధిక్కరించి మరొకరికి మద్దతిచ్చేంత ధైర్యం జగన్ కు లేదనేది పసిపిల్లల్ని అడిగినా చెబుతారు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ కేవలం ఆటలో అరటిపండులా ఉండాల్సిందే. అందుకే ఆయనకు రాజ్ నాధ్ సింగ్ ఫోను చేయడం ఒక కామెడీ అనుకోవాలి.

దానికి జగన్ ఇచ్చిన జవాబు ఇంకా కామెడీగా ఉంది. ఈ విషయంపై పార్టీ నేతలతో చర్చించి చెబుతానని ఆయన అన్నారట. నిజంగా వారు ప్రభావితం చేసే కీలక విషయాలనే పార్టీ నేతలతో చర్చించే అలవాటు లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనవన్నీ మోనార్క్ పోకడలు అని పార్టీ వారే చెబుతుంటారు. ఇక్కడ తాము చేయగలిగింది ఏమీ లేని దానికి .. పార్టీ వారితో మాట్లాడి చెబుతానని జగన్ అనడం టూమచ్ కామెడీగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. రాజ్ నాధ్ సింగ్ కూడా ఏదో ఫార్మాలిటీ కోసం ఫోను చేశారే తప్ప.. జగన్ అవసరం ఉండబట్టి కాదని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories