వైసీపీని ఇరుకున పెడుతున్న రజని మాటలు! 

సాక్ష్యాధారాలతో సహా, ఆమె అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అరాచకాలు, దందాల గురించి పక్కా వివరాలను పోగేసిన తర్వాతనే ఏసీబీ అధికారులు మాజీ మంత్రి విడుదల రజిని మీద  కేసు నమోదు చేశారు. తనతోపాటు మరిది గోపి, తన దందాకు సహకరించిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా మీద కూడా కేసులు నమోదు కావడం రజనిని కంగారు పెడుతోంది. తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ఆమె ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నారు. తనమీద తప్పుడు కేసు బనాయించారని కేసు పెట్టిన వాళ్ళు తెలుగుదేశానికి చెందిన వ్యక్తులని, వారిని తన పదవీకాలంలో ఎన్నడూ చూడనేలేదని కూడా అంటున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనను టార్గెట్ చేశారని గతంలో గురజాల డిఎస్పి, సిఐ లకు లంచాలిచ్చి తన కాల్ డేటా సేకరించే ప్రయత్నం చేశారని ఆ విషయం తాను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లిన తర్వాత ఆయన మందలించారని.. ఇవన్నీ మనసులో పెట్టుకొని తన మీద కక్ష సాధిస్తున్నారని విడదల రజని ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. లావు శ్రీకృష్ణదేవరాయలను విలన్ గా ప్రొజెక్టు చేయడానికి రజిని మాట్లాడుతున్న మాటలు మరొక ఎత్తు. ఆమె మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నే ఇరుకుని పెట్టేలాగా ఉన్నాయని ఆ పార్టీలోని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

విడదల రజని లంచాలు తీసుకున్నారంటూ నమోదైన ఏసీబీ కేసుల  వ్యవహారం చిలకలూరిపేట నియోజకవర్గ పరిధికి సంబంధించినది కాగా.. ఈ వివాదంలోకి నరసరావుపేట ఎంపీ ని లాక్కు రావడమే ఆశ్చర్యంగా ఉంది. రజిని చెబుతున్న మాటలు కొన్ని నమ్మశక్యంగా కూడా లేవు. 2020లో గురజాల డిఎస్పి, సీఐలకు కృష్ణదేవరాయులు లంచాలు ఇచ్చి తనతో పాటు తన కుటుంబ సభ్యుల మొబైల్స్ కాల్ డేటా తీయించారనేది ఆమె ఆరోపణ. ఆనాటికి కూడా కృష్ణదేవరాయలు వైసిపి అంటే అధికార పార్టీ తరఫున ఎంపీ గానే ఉన్నారు. అధికార పార్టీ ఎంపీ తన పరిధిలోని ఒక డిఎస్పి కి ఫలానా వారి కాల్ డేటా కావాలని పని పురమాయించడానికి లంచాలు కూడా ఇవ్వాల్సి ఉంటుందా అనేది సామాన్యుడి సందేహం. అలాగే 2024 ఎన్నికలు వచ్చినప్పుడు నరసరావుపేట పరిధిలోని వైసిపి ఎమ్మెల్యేలు అందరూ జగన్ వద్దకు వెళ్లి అక్కడ కృష్ణదేవరాయలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని, మారిస్తే పార్టీ నష్టపోతుందనీ మొరపెట్టుకున్నారు. అందరి వద్ద మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణదేవరాయులు విడదల రజనికి మాత్రం విలన్ గా కనిపించడం గమనార్హం. 

ఆయన గురించి నెగిటివ్ కోణాలను ప్రచారం చేసే లక్ష్యంతో విడదల రజని మరో ఆరోపణ కూడా చేశారు. ఎంపీ వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో అనేక భూములను కారుచౌకగా కొట్టేశారని ఆమె ఆరోపించారు. ఈ విమర్శ కృష్ణదేవరాయలను ఉద్దేశించినది అయినప్పటికీ మొత్తం గా వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టే వ్యవహారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో విశాఖపట్నంలో ఉండే సహజ వనరులను, భూములను దోచుకోవడానికి మాత్రమే ఆయన ఆ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించి దందా నడిపించారని ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. వైసీపీ నేతలందరూ కూడా రకరకాల ముసుగుల్లో విశాఖ భూములను కబ్జా చేశారని కారుచవుకగా దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణదేవరాయల గురించి కూడా రజని అదే మాటలు చెబుతున్నారు. ఇది నిజమని  నమ్మాల్సి వస్తే గనుక ఇలాంటి అనేక అనేక దందాలు వైసిపి నాయకులు విశాఖవ్యాప్తంగా చెలరేగిపోయి చేశారని అనుకోవాల్సి వస్తుంది. అందుకే విడుదల రజని ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడడం వలన పార్టీ ఇరుకున పడుతున్నదని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories