తలైవా రజినీకాంత్ గతేడాది జైలర్ సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా రజిని కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం లో వచ్చిన “లాల్ సలాం” అనే సినిమాలో అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత రజనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వెట్టయాన్’.
తెలుగులో ‘వేటగాడు’ అనే టైటిల్ తో వస్తున్నఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ వంటి వారు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.
దీంతో ఈ సినిమా విడుదల తేదీ గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. అయితే విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అక్టోబర్ 10 వ తేదీన యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “దేవర” రిలీజ్ కానుంది అని చిత్రం యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే ఎన్టీఆర్ సినిమా ఇంకా ముందే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. దేవర ప్రీపోన్ కాకపోతే ఎన్టీఆర్ ,రజిని మధ్య బాక్సాఫీస్ వార్ తప్పేట్లు లేదు మరి.