సోషల్ మీడియాలో ఇటీవలి రోజుల్లో హాట్ టాపిక్‌గా మారింది సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు కమల్ హాసన్ మల్టీస్టారర్ సినిమా గురించే. రజినీకాంత్ నటించిన కూలీ విడుదలైన తర్వాత ఆయన మళ్లీ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి భారీ స్థాయిలో మల్టీస్టారర్ చేయబోతున్నారని టాక్ వచ్చింది. ఈ మధ్య కమల్ హాసన్ కూడా రజినీకాంత్‌తో సినిమా గురించి మాట్లాడటం వల్ల ఈ వార్త మరింత బలంగా వినిపించింది.
తాజాగా రజినీకాంత్ కూడా కమల్‌తో ప్రాజెక్ట్ ఉందని ధృవీకరించారు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ కాకుండా మరో దర్శకుడు తెరకెక్కించబోతున్నాడన్న మాట బయటకు రావడం. కానీ ఆ దర్శకుడు ఎవరో మాత్రం ఇంకా ప్రకటించలేదు. రజినీకాంత్ కూడా ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వకుండా దాటవేశారు.