నెల్సన్ కి ట్రీట్‌ ఇచ్చిన రజినీ!

ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీగా ఆసక్తి రేపుతున్న సీక్వెల్ చిత్రాల్లో “జైలర్ 2”కి ప్రత్యేక స్థానం ఉంది. మొదటి భాగం అంచనాలకు మించి విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు రెండో పార్ట్ పై అభిమానుల్లో అపారమైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయిన దశ నుంచే భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఇలాంటి సమయంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పుట్టినరోజు వచ్చేసింది. ఆయన బర్త్‌డే సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్పెషల్ రోజు నెల్సన్ షూటింగ్ సెట్లోనే తలైవర్ రజనీకాంత్ తో కలిసి జరుపుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. జైలర్ ఫస్ట్ పార్ట్ లో కనిపించిన తలైవర్ లుక్ లోనే రజనీ కనిపించడం ఫ్యాన్స్‌కి మరింత ఎగ్జైట్‌మెంట్ ఇచ్చింది.

రజనీకాంత్ స్వయంగా కేక్ కట్ చేయించి, నెల్సన్ కు తినిపించిన ఆ క్లిక్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటిఫుల్ మూమెంట్‌కి సంబంధించిన ఫోటోలు సన్ పిక్చర్స్ తమ అధికారిక అకౌంట్ ద్వారా షేర్ చేయడంతో, అవి కాసేపులోనే వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, జైలర్ లో హాస్యానికి హాయిగా నవ్వులు పంచిన యోగిబాబు కూడా ఆ వేడుకలో పాల్గొన్నారు.

ఇలా “జైలర్ 2” సెట్స్ లో పుట్టినరోజు సందడి జరగడం చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories